కౌలు రైతులకు అండగా జనసేన: మత్స పుండరీకం

ఎన్.అర్.ఐ జనసైనికుడు మైలవరపు రాజా ఆద్వర్యంలో టీం పిడికిలి వారు రూపొందిచిన
గోడ ప్రతులు, ఆటో స్టిక్కర్లును పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గo వీరఘట్టం మండలం లో కౌలురైతులు మరియు జనసైనికులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా టీమ్ పిడికిలి కోఆర్డినేటర్మత్స పుండరీకం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అప్పులుపాలై ఆత్మహత్య చెసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల చోప్పున 3 వేల మంది రైతులను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ 30 కోట్ల సొంత నిధులను సమకూర్చడం జరిగిందన్నారు. ఇప్పటికే రెండు జిల్లాలోని కౌలు రైతు కుటుంబాలకు సాయం అందించడం జరిగిందని, ఆదివారం ( మే 8 న) కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి సాయం అందించడం జరిగిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం చేస్తున్న ఔదార్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీమ్ పిడికిలి ఈ గోడ ప్రతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా టీం పిడికిలి చేస్తున్న సేవలు వెళకట్టలేనివన్నారు. అనంతరం గోడలకు, ఆటోలకు పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమంలో బబ్బది పకీరు నాయుడు, చింత గోవర్ధన్, కర్ణేన పవన్ సాయి, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, కడగల హరికృష్ణ, గొర్ల మన్మధ, సిరిపోతు ప్రసాద్, దండేలా సతీశ్, దారపురెడ్డి శ్రవణ్, వావిలపల్లి నాగభూషన్, దత్తి గోపాలకృష్ణ, కోడి వెంకట రావు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.