ఆంధ్ర కేసరి సేవలు అనిర్వచనీయమైనవి: గాదె

గుంటూరు, బ్రిటిష్ పోలీసులు తుపాకీ తన గుండెలపై ఉంచి కాల్వమని గర్జించిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గాదె వెంకటేశ్వరరావు, నాయబ్ కమాల్ టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర కేసరి సేవలు అనిర్వచనీయమైనవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, చట్టాల త్రినాథ్, ఆళ్ళ హరి, శిఖా బాలు, కొర్రపాటి నాగేశ్వరరావు, కొత్తకోట ప్రసాద్ పాల్గొన్నారు.