గుడ్లూరు మండలంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

మెగాస్టార్ చిరంజీవి 67 వ జన్మదిన సందర్భంగా సోమవారం చిరంజీవి పుట్టినరోజు వేడుకలు గుడ్లూరు మండలంలో చిరంజీవి యువత మండల అధ్యక్షులు మూలగిరి శ్రీనివాస్ మరియు మెగా అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం 8 గంటలకు చిరంజీవి తరపున గుడ్లూరులోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అర్చన, తదుపరి మధ్యాహ్నం 12.30 గంటలకు గుడ్లూరు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు అన్నప్రసాద వితరణ, అలాగే సాయంత్రం 6 గంటలకు స్థానిక బస్టాండ్ సెంటర్లో కేక్ కటింగ్ మెగా అభిమానులు ఆధ్వర్యంలో కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత మండల అధ్యక్షులు మూలగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ చిరంజీవి అంటే ఒక స్వయంకృషి, చిరంజీవి అంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంక్ మరియు ఇటీవల కరోనా కష్ట కాలంలో 40కోట్లు ఖర్చు చేసి ఆక్సిజన్ బ్యాంక్ ల వంటి ఒక సేవ, చిరంజీవి అంటే ఒక ఉన్నత శిఖరం, చిరంజీవి అంటే ఒక పట్టుదల – సాహసం, చిరంజీవి అంటే ఒక తనను విమర్శించిన వారిని కూడా తిరిగి విమర్శించకుండా వారి మానసిక స్థితి బాగోలేదు అని వదిలేసే ఉత్తమ గుణం ఇలా చెప్పుకుంటూ పొతే మరెన్నో అంశాలకు ఒక నిలువెత్తు వారధియే చిరంజీవి అని కేక్ కట్ చేయడానికి ముందుగా మెగా అభిమానులు ఆనందోత్సాహాల మధ్య వివరించారు. తదనంతరం కళ్ళగుంట చంద్రమ్మ పేద కుటుంబానికి 25 కెజిల బియ్యం మరియు నిత్యావసర సరుకులు మెగా అభిమానులు అధ్యక్షులు మూలగిరి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తదనంతరం మెగా అభిమానులు, కార్యకర్తలకు కేక్, పులిహోర పంచిపెట్టారు. ఈ కార్యక్రమాలలో అన్నంగి చలపతి, రామిశెట్టి ఏసు, కర్పూరపు వెంకట నారాయణ, ఇన్నమూరి సుధాకర్ తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.