ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ వల్ల పేద వర్గాలకు ఒరిగేదేమీ లేదు: బుదిరెడ్డి శ్రీనివాస్

జగ్గంపేట జనసేనపార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గురువారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిప్పులు చెరిగారు. వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన నాలుగు సంవత్సరాలుగా వివిధ రంగాలకి ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయించి మరలా వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి తిరిగి సంక్షేమ పథకాల పేర్లతో దొడ్డిదారిన వాళ్ల పార్టీకి ప్రచారం చేసుకోవడం కోసం ఆ నిధులను మళ్లించుకున్నారని ఆరోపణలు చేశారు. అలాగే ఇప్పటివరకు ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ ని సక్రమంగా ఖర్చు పెట్టాము అని ఏ విధమైన అవకతవకలు జరగలేదు అని శ్వేత పత్రం రిలీజ్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మీట్ అని ఒక పేరుతో సుమారు 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి మన రాష్ట్రాన్ని రాష్ట్ర యువతని ప్రజల్ని మోసం చేశారన్నారు. నవరత్నాల పేరుతో మోసపూరితమైన సంక్షేమాల పేరుతో ప్రభుత్వఒ ఏర్పాటు చేసుకున్న ఈ వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వానికి కాలం చెల్లి పోయిందని నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం వాళ్ల పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడం కోసం జగన్ రెడ్డి ఫోటోతో కూడిన గోడప్రతులు, కరపత్రాలు మొదలగు ప్రచార సాధనాలకోసం వారు దొడ్డిదారిన నిధులు తిరిగి మళ్ళించుకోవడం కోసం వివిధ రంగాలకి నిధులు కేటాయించామని వాళ్ళు పేర్లు చెప్పుకొని ఆ నిధుల్ని దొడ్డిదారిలో వాళ్ల పార్టీ స్టిక్కట్లు, పాంప్లెట్లను కొట్టించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వాళ్ళ ప్రభుత్వం మరల ఎన్నికలలో ఓట్లు కొనుక్కోవడానికి ప్రజాధనాన్ని వృధా చేయడం కోసం వీళ్ళు నిధులను దారి మళ్ళించుకోవడానికి ఈ బడ్జెట్ పేరుతో ప్రయత్నం చేస్తున్నట్లే ఉందన్నారు.