పీపుల్స్ వాయిస్ ఆఫ్ జనసేన ఆద్వర్యంలో అంజనా దేవి జన్మదిన వేడుకలు

వైజాగ్ వెస్ట్: ఏ నోము నోచి కన్నావో.. ఏ పూజ చేసి మొక్కావో తెలీదు కానీ, త్రిమూర్తులు లాంటి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చి.. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల జీవితాలను బాధ్యతగా తీసుకుని సమాజమే ఇల్లుగా బ్రతుకుతూ, నిత్యం ప్రజల కోసం పని చేసే బిడ్డల్ని సమాజానికి అందచేసిన మాతృమూర్తి అంజనమ్మ జన్మదినం సందర్బంగా వెస్ట్ వైజాగ్ లోని బంగారు తల్లి వృద్ధాశ్రమంలో వృద్దులకు “పీపుల్స్ వాయిస్ ఆఫ్ జనసేన” టీం ద్వారా సాయంకాలం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.