ఘనంగా చి. సంజయ్ పుట్టిన రోజు వేడుకలు

గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బెజవాడ తులసీదర్ కుమారుడు చి. బెజవాడ సంజయ్ దీక్షిత్ 4వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో పేదవారికి గుడివాడ ఎన్జీవో హోం వద్ద అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మాధవసేవే మానవసేవ అనే నినాదంతో గుడివాడ పట్నంలో పలు సేవా కార్యక్రమలు చేయడంతో మమ్మల్ని సంప్రదించి చిరంజీవి సంజయ్ దీక్షిత్ పుట్టినరోజు వేడుకలు పేదవారి మధ్యలో చేసుకుని ఆకలితో ఉన్న అనాదలకు ఆహారం అందజేయడం మంచి ఆలోచన అని అందరూ పిల్లలు పుట్టిన రోజులకి పెద్దపెద్ద ఆడంబరాలు కాకుండా వృద్ధుల ఆశ్రమంలో గాని ఆకలితో ఉన్న అనాదలకు గాని ఆహారం అందజేస్తే వారి దీవెనలతో పాటు సమాజ విలువలు తెలుస్తాయని తెలియజేశారు. పేదవారికి అన్నం పెట్టడం వలన ఒకరోజు వారికి ఆకలిని తీర్చిన వారం అవుతాము. ఈ మంచి కార్యక్రమం చేసిన ఇన్స్పెక్టర్ తులసిధర్ మంచి మనసుకు అభినందనలు తెలియపరచుకుంటున్నాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూనె అయ్యప్ప, కిరణ్, చరణ్ తేజ్, శివ నాగ సాయి మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.