సీజనల్ వ్యాధులు మరియు కరోనాపై అవగాహన చేపట్టిన అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్

విజయనగరం, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు)ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక 42వ డివిజన్లో అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న ఎస్సి, బీసీ కొలనీలో సీజనల్ వ్యాధులపైన మరియు కరోనాపై అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు.

ముఖ్యఅతిధిగా విచ్చేసిన డాక్టర్ ఎస్. మురళీమోహన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఈ సీజనల్ వ్యాధులపట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. ప్రతీఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని.. అందరూ వేడి ఆహారపదార్ధాలను, వేడి పానీయాలను సేవించాలని, ప్రతీఒక్కరూ ఈ వర్షాకాలం అవ్వటం వలన జలుబు, జ్వరాలు రావటం పట్ల అశ్రద్ధ చేయకుండా సరియైన వైద్యం చేయించుకోవాలని తెలుపుతూ, కరోనా ఒవైపు ముంచుకోస్తున్న నేపథ్యంలో బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ప్రతీఒక్కరూ ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతోగాని, శ్యానిటేజర్ తో గాని శుభ్రపరుచుకోవాలని అన్నారు.

మరో అతిధిగా విచ్చేసిన క్లబ్ పెద్దలు అదాడ మోహనరావు మాట్లాడుతూ ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నందున ఇంటి పరిసర ప్రాంతాల్లోను, కాలువల్లోను తరుచుగా బ్లీచింగ్ ను, ఫినాయిల్ ను చల్లాలని,ముఖ్యమగా పిల్లలు బయట ఫాస్ట్ ఫుడ్స్, నిలువచేసే తినుబండారాలు కొనుక్కొని తినరాదని, వీటివల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. సీజనల్ వ్యాధులపట్ల అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను సంప్రదించి సరియైన వైద్యం చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు శ్రీను, రాజు, గోపి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.