విద్యా దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలి: వాసగిరి మణికంఠ

అనంత జిల్లా జనసేన కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ.. కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మారుతున్న రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడం చాలా సిగ్గుచేటు.. కరోనా విపత్కర పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్య ప్రజల నడ్డివిరిచే విధంగా జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టికలు ఉన్నా ఆ నిబంధనలు పక్కనపెట్టి తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు అంతేకాకుండా వారి విద్యాసంస్థల్లో నే పాఠ్యపుస్తకాలను కొనాలనే నిబంధనలను పెట్టి అధిక ధరలకు అమ్ముతూ విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో విద్యా దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం మరియు విద్యాధికారులు అరికట్టేందుకు చర్యలు తీసుకోకుండా ఉండడం ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నారు.

అంతేకాకుండా విద్యాశాఖ ప్రతి సంవత్సరము 10% ఫీజులు మాత్రమే పెంచాలని ఆదేశాలున్నా వాటిని పెడచెవిన పెట్టి కార్పొరేటర్ స్కూలు 20 నుండి 30% ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. విద్యా హక్కు చట్టం కింద ప్రతి సంవత్సరము కార్పొరేటు ప్రైవేటు పాఠశాలల్లో 25% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఉచిత విద్య రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులకు అందుతుందో విద్యాశాఖ అధికారులు వివరాలు వెల్లడించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకై రాబోయే రోజుల్లో సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వెంటనే కార్పోరేటు స్కూళ్ల ఆర్థిక దోపిడి నియంత్రణకై విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.