జనసేన డిజిటల్ క్యాంపెయిన్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అంజూరు చక్రధర్

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు @ఝనశెనఫర్త్య్ డిజిటల్ క్యాంపెయిన్… విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా జనసేన పార్టీ తరఫున ఈ నెల 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేపడదాం. ఇందులో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనే విషయాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళాలి.

వైసీపీ కె 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు ఉండి కూడా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పకపోగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో ఉంది. వారికి బాధ్యతను గుర్తు చేయాలన్న లక్ష్యంతో డిజిటల్ క్యాంపెయిన్ సాగిద్దాం. వైసీపీతోపాటు టీడీపీ ఎంపీలు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడాలి. ప్లకార్డులు ప్రదర్శించాలి. ఈ బాధ్యతను వారికి తెలియచేసేలా మన రాష్ట్రానికి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులను ట్యాగ్ చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంతోపాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విషయాన్ని పార్లమెంట్ కు తెలియచేయమని గౌరవ ఎంపీలను సోషల్ మీడియా ద్వారా కోరదామని తద్వారా జనసేన డిజిటల్ క్యాంపెయిన్ విజయవంతం చేయాలని అంజూరు చకరధర్ పిలుపునిచ్చారు.