యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

రాజంపేట నియోజకవర్గం: ములక్కాయ పల్లె గ్రామంలో శ్రీ దుర్గమ్మ తల్లి దేవస్థానంలో విజయదశమి సందర్భంగా. సోమవారం గ్రామ ప్రజలు గ్రామ యువత ఆహ్వానం మేరకు రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు దుర్గమ్మ తల్లి దేవస్థానం కు వెళ్లడం జరిగింది. ముందుగా గ్రామ ప్రజలు యల్లటూరు శ్రీనివాస రాజును ఘనంగా మేళ తాలాళతో ఆహ్వానించారు. తర్వాత గ్రామంలో ప్రజలు అదేవిధంగా రాజంపేట నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి. ఎంతగానో కృషిచేసిన కె. వీర నరసింహ వర్మ మరియు వై పెంచల్ రాజు యల్లటూరు శ్రీనివాసరాజు శాలవాలతో పూలమాలలు వేసి సన్మానించారు. తరువాత గ్రామంలో ప్రజలు అందరికీ యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు గ్రామ పెద్దలు యువత పిల్లలు ఎంతో సంతోషంగా వేలాదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, ఆకుల చలపతి, పచ్చిపులుసు సత్య నరసింహ, చిట్టే బాస్కర్, నాసర్ ఖాన్, పత్తి నారాయణ, మౌల, కట్టారుబాబు, రాజాఆచారి, ఏల్చూరి చిన్న, బాస్కర రాజు, అబ్బిగారి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.