శివయ్య సేవలో అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ

అన్నవరం మండలంలోని నిరుపేదలకు సేవలు అందిస్తున్న అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు శుక్రవారం శివయ్య సేవలో పాల్గొన్నారు. సీతయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా మృత్యుంజయ హోమం కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొని వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులకు అన్ని రకాలుగా సేవలు అందించారు. కాగా సుమారు చుట్టుపక్కల భక్తులు 5వేల మంది పాల్గొన్నారు. దైవ కార్యక్రమంలో పాల్గొనటం అదృష్టం అని వ్యవస్థాపకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాబ్జి రెడ్డి, కర్రీ వాసు, రాజు, లలిత, సంగీత, రాజేష్, ప్రవీణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.