బెంతో ఒరియాల భారీ ర్యాలీకి దాసరి రాజు మద్దతు

శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం పట్టణంలో ప్రజా ప్రస్థాన విజయవాటిక నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నియోజకవర్గంలోని బెంతో ఒరియా గిరిజనులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న జనసేన ఇచ్చాపురం సమన్వయ కర్త దాసరి రాజు మాట్లాడుతూ బెంతో ఒరియాలకు న్యాయం చేయాలని ఏ ఎన్నికలు దగ్గర కావస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించక పోవడం ఏమనుకోవలని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలో పూర్వం నుండి యస్ టీ లుగా గుర్తింపు పొందిన మాకు ఎటువంటి ప్రభుత్వ జీఓ జారీ లేకుండా కుల ధ్రువీకరణ నిలిపిన అధికార దుర్వినియోగం చేస్తున్న రెవిన్యూ డిపార్ట్మెంట్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. బెంతో ఒరియా విద్యార్థులకు పూర్తి స్థాయిలో కులంతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ లు జారీ చేయనందున విద్యా మరియు ఉపాధి అవకాశలు కోల్పోతున్నామన్నారు. విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ మంజూరు కావడం లేదని వాపోయారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కమిషన్ లు మీద కమీషన్ లు వేస్తూ కాలక్షేపం చేస్తూ తమ భవిష్యత్ ని నాశనం చేస్తున్నారు అని వాపోయారు. ఓటు వేసి గెలిపించిన మాకు స్థానిక ప్రజా ప్రతినిధులు మా సమస్యను పరిక్షారా కోణంలో పాటు పడాలని కోరారు. ఎన్నికల సమయంలో సీ యమ్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని రిలే నిరాహార దీక్ష 71వ రోజుకు చేరుకున్న స్పందించక పోవడం బాధాకరం అని న్యాయం చేయాలని ఇందులో భాగంగా ఇచ్చాపురం పట్టణం నడి బొడ్డున మనహారం నిర్వహించి నినాదాలు చేసారు. ఈ కార్యక్రమం లో బెంతో ఒరియా యూత్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్సులు సుమన్ బిసాయి, దుదిష్టి మజ్జి, శంకర్ సాహు, జయసేన్ బిసాయి, శ్రీకాంత్ పురియా, హరికృష్ణ బిసాయి, పురుసు బిసాయి, రజనీ కుమార్ దొళాయి, బిసాయి, మోహన్ సాహు, మేఘనాధ్ బిసాయి, పాండు దలై, బృందావన్ బిసై, కృష్ణ బిసాయి, లోక్నాత్ బిసై తదితరులు పాల్గొన్నారు.