కిడ్నీ వ్యాధిగ్రస్తునికి అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్థిక సహాయం

శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, మాణిక్యపురం గ్రామానికి చెందిన దిలీప్ దళాయి అనే యువకుడు గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆ గ్రామ యువకుల ద్వారా తెలుసుకొని అన్నవరం హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు వెళ్లి పరామర్శించి గ్రామ పెద్దలు దేవరాజు, మోహన్ సమక్షంలో అక్షరాల రూపాయలు 5500/- ఆర్థిక సహాయం అందించారు. గ్రామస్తులు సంస్థ సభ్యులను అభినందించారు. వ్యస్టపకుడు మాట్లాడుతూ విరాల ధాతలకు మరియు సహాయ ధాత పాండవ శేఖర్ లకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ రెడ్డి, సిద్దు, లలిత, సునీత, సుజాత, దినేష్, ప్రశాంత్, రాజేష్, నొర్సింగో, ప్రవీణ్, జైసన్, ధనుంజయ, గోపి పాల్గొన్నారు.