జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు – సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ యుద్ధం

పెడన, వైసిపి ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు పథకం అతిపెద్ద కుంభకోణం. భూమి కొనుగోలు, మౌలిక వసతులు పేరిట వేల కోట్లు అవినీతి జరిగింది. ఈ అవినీతి బాగోతాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈనెల 12,13,14 తేదీల్లో జగనన్న కాలనీలో జరిగిన అవినీతిని సోషల్ మీడియా వేదిక ద్వారా #jaganannamosam హాష్ ట్యాగ్ తో కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా పెడన నియోజకవర్గంలో జగనన్న కాలనీలో భారీ కుంభకోణాలు జరిగాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన నియోజకవర్గంలో తన అనుచరులను బినామీ కాంట్రాక్టర్లుగా అనేక అవినీతికులకు పాల్పడ్డారు. పెడన పట్టణానికి సంబంధించిన పల్లోటి 1, పల్లోటి 2, పైడమ్మ కాలనీల 38 ఎకరాలలో ఒక్కొక్కరికి సెంటు స్థలం చొప్పున 2000 మందికి పైగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. పల్లపుభూమి కావటం వలన మెరక చేయుటకు రూ.6.30 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ మట్టి తోలకుండా 2.29 కోట్ల రూపాయలను బిల్లులు చేసుకున్నారు. నాలుగు కోట్ల రూపాయలకు బిల్లులు పెట్టడం జరిగింది. ఒక పెడనపట్నానికి సంబంధించి ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందంటే నియోజకవర్గంలో ఇంకెన్ని కోట్లు అవినీతి జరిగిందో ఊహించుకోవచ్చు. డాంబికాలు పలికే జోగి రమేష్ కి దమ్ముంటే ఈ మూడు కాలనీల మెరక పనుల అవినీతిపై చర్చకు రావాలి. టీవీల్లో ఏ రాష్ట్రంలో కాలనీ కైనా వస్తావని సవాలు చేయటం కాదు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో, పైగా మీరు నిర్వహిస్తున్న గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయట పెడతాం. ఈరోజు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పర్యటించి జగనన్న కాలనీలోని జరుగుతున్న మోసాలను బయటపెట్టారు.

  1. గూడూరు మండలం తలకుటూరు గ్రామపంచాయతీ పరిధిలో జగనన్న కాలనీ పేరుతో 88 మంది లబ్ధిదారులకు ఇల్లు కేటాయించడం జరిగింది. కానీ ఆ కాలనీలో కేవలం 5 ఇల్లు నిర్మాణం ప్రారంభించి, పునాదుల దగ్గరే ఆగిపోయింది. కాలనీ మొత్తం చెరువును తలపిస్తుంది.
  2. గూడూరు మండలం మద్దిపట్ల గ్రామంలోని జగనన్న కాలనీ సందర్శించడం జరిగింది.
    ఈ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం ప్రారంభం కాలేదు.
  3. గూడూరు మండలం కంచ కోడూరు గ్రామంలో జగనన్న కాలనీని స్మశాన వాటిక పోయే దారిలో ఇవ్వటం వల్ల ఆ గ్రామంలో ప్రజలందరూ అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపటం లేదు.

కంచ కోడూరు గ్రామంలో స్థానికులు మాకు అన్ని సదుపాయాలతో ఇళ్ల స్థలాలను కేటాయించాలని మహిళలు డిమాండ్ చేశారు. స్మశానం దింపుడు కళ్ళం దగ్గర ఇళ్ల స్థలాలను కేటాయిస్తే ఏ రకంగా కట్టుకోవాలని మంత్రి జోగి రమేష్ ని ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు, బత్తిన హరి రామ్, పాండమనేని శ్రీనివాసరావు, గరికపాటి ప్రసాద్, గల్లా హరీష్, శీరం సంతోష్, సమ్మెట శివనాగ ప్రసాద్, కార్తీక్, బెనర్జీ, గంట రవి, కోలపల్లి చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, భీమవరపు పరమేశ్వరరావు, దాసరి రవీంద్ర, దాసరి నాని, కనపర్తి వెంకన్న, పినిశెట్టి రాజు, రెహమాన్ ఖాన్, పుప్పాల బుజ్జి మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.