కాగ్ సమాచారంతో జనసేనాని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

  • నందికొట్కూరు జనసేన డిమాండ్

నందికొట్కూరు నియోజకవర్గం: నందికొట్కూరు జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో భాగంగా పార్టీలో కొత్త సభ్యులు జనసేన పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరారు. జనసేన కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కాగ్ సంస్థ సమాచారంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. దాదాపు 1.18 లక్షల కోట్ల ప్రజాధనానికి సరైన లెక్కలు చూపలేదంటూ పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి.. అలాగే కాగ్ అనే సంస్థ అడిగిన 25 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమానికి నల్లమల రవికుమార్, జనసేన మధు, బోరెల్లి వెంకటేష్, పారుమంచాల రాజు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే నికార్సైన రాజకీయ నాయకుడని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు.