పోతిరెడ్డిపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

  • రైతులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
  • నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో డి. ఎం కి వినతి పత్రం అందజేసిన వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్: గత 3,4 సంవత్సరాలుగా పోతిరెడ్డిపల్లి గ్రామం నుంచి, నాగర్ కర్నూల్ కు, పోతిరెడ్డిపల్లి గ్రామం నుంచి జడ్చర్ల కు బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్ మీడియట్ చదివే విద్యార్థులు, రైతులు, వ్యాపారులు బస్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని సోమవారం నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో డీ.ఎం కి జనసేన తరపున వంగ లక్ష్మణ్ గౌడ్ పూర్తిగా వివరించి, కచ్చితంగా పోతిరెడ్డిపల్లి గ్రామానికి ఉదయం 8 గంటలకు, సాయంకాలం 4 గంటలకు నాగర్ కర్నూల్ కు బస్సు, ఉదయం మరియు సాయంకాలం జడ్చర్ల కు బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన డీఎం కచ్చితంగా వెంటనే పోతిరెడ్డిపల్లి గ్రామానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసి నాగర్ కర్నూల్ నుంచి గ్రామానికి కచ్చితంగా వారం రోజుల్లో బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు గోపాస్ కుర్మన్న, కొడిగంటి సాయి కుమార్, విజయ్ భాస్కర్ గౌడ్, సూర్య, రాజు నాయక్, మహేష్ గౌడ్, మహేష్, ఎడ్ల ప్రసాద్, అనుపటి పవన్ కుమార్, సందీప్, పూస శివ, డి.మహేష్ త
దితరులు పాల్గొన్నారు.