జనసైనికుని షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనుశ్రీ సత్యనారాయణ

రాజమండ్రి సిటీ, స్థానిక జాంపేట సెంటర్ వద్ద జార్జ్ క్వా షాపు ప్రారంభోత్సవం సందర్భంగా నగర జనసేన నాయకులు మట్టాడి పండు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరవడం జరిగింది. ఆయన చేతుల మీదగా రిబ్బన్ కటింగ్ చేసి షాప్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీలు వైవిడి ప్రసాద్, గడ్డం నాగరాజు, రాజమండ్రి కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి పైడిరాజు, నగర జనసేన నాయకులు విక్టరీ వాసు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.