AP cabinet meeting: 28న ఏపీ కేబినెట్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం ఒకదానిపై మరొకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 28న కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశా ఇదే మంత్రులకు చివరి సమావేశం కానుందని సమాచారం. దీంతో కేబినెట్ సమావేశంపై అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గంలో 90 శాతం వరకు మార్పులుంటాయని తెలుస్తోంది.

మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేసేందుకే సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రం లో జరుగుతున్న పరిణామాలతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కేబినెట్ ప్రక్షాళనకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై జగన్ ఇప్పటికే సర్వేలు చేయించుకున్నట్లు చెబుతున్నారు. మంత్రుల పనితీరు, జిల్లాలో వారి ప్రాధాన్యం తదితర విషయాలపై ఓ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఆధారంగా కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని సమాచారం. కేబినెట్ సమావేశంలో చేపట్టబోయే అంశాలపై పార్టీ నాయకులతో జగన్ ఇప్పటికే చర్చించారు.

రాబోయే ఎన్నికలే లక్ష్యంగా జగన్ ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో పార్టీ కార్యక్రమాలు ఉధృతం చేసేందుకు నిర్ణయించుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రతిపక్షాలకు కూడా తగిన రీతిలో సమాధానం చెప్పేందుకు సీఎం సమాయత్తం అవుతున్నట్లు చెబుతున్నారు.