ఏపి ప్రభుత్వం మరియు పాలకులు ప్రజల కోసం పనిచేయండి

మదనపల్లి, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరిపాలన పై దృష్టి సారిస్తే బాగుంటుందని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. అలా కాకుండా సినిమా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది సినిమాల మీద ఆధారపడి ఉంటారు వారి జీవితాల మీద, వారి ఆర్థిక మూలాలు మీద దెబ్బ కొట్టడం బాధాకరంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం అటు సినిమా వాళ్ళని ఇటు అభిమానులను అందర్నీ ఇబ్బంది చేస్తుంది ఇది మానుకోవాలి ప్రభుత్వం అలా లేనిపక్షంలో రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం ఖాయమని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సినిమావాళ్ల మీద కాకుండా పరిపాలన మీద దృష్టి సారించి ప్రజల శ్రేయస్సుకు పని చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానని జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.