ఏపీ మంత్రి సురేశ్ దంపతులకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ దంపతులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని ఆదేశించింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ ఈ ఆదేశాలను జారీ చేసింది. 2016లో దేశవ్యాప్తంగా ఐఆర్ఎస్ అధికారుల ఇళ్లలో సోదాల సందర్భంగా ఆదిమూలపు సురేశ్, ఆయన భార్య ఐఆర్ఎస్ అధికారి అయిన విజయలక్ష్మి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. 2010–2016 మధ్య వారి ఆస్తులు ఆదాయానికి మించి 22 శాతం ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వారిద్దరి ఆదాయం రూ.4.84 కోట్లే కాగా.. అంతకుమించి రూ.5.95 కోట్ల ఆస్తులున్నాయని తేల్చారు. దీంతో నాడు వారిద్దరిపై సీబీఐ కేసును నమోదు చేసింది.