జనసేన విజయ యాత్ర – ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – 66వ రోజు

  • గ్లాసు గుర్తుకి ఓటు వెయ్యండి, జనసేనను ఆదరించండి

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన విజయ యాత్ర – ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ 66వ రోజు ఇంటింటికీ ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి మండలం, ఎగువ వీధి పంచాయతీలోని ఎగువ వీధి హరిజనవాడ, కోట గ్రామాల్లో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. ప్రతి ఇంటా వినుత కోటాకి మంగళ హారతులతో జనసైనికులు, ప్రజలు ఆహ్వానం పలికి, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీ ని, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటా గారిని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తుకి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది. మార్పు కోసం జనసేన పార్టీ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కావలి శివకుమార్, నాయకులు దాము, వెంకటేష్, జనసైనికులు గురవయ్య, నవీన్, విజయ్, ప్రసాద్, బి.నవీన్, భాను ప్రసాద్, వై. వెంకటేష్, అశోక్, మండల అధ్యక్షులు పేట చంద్ర శేఖర్, తోట గణేష్, నాయకులు రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, పేట చిరంజీవి, రాజ్య లక్ష్మి, నక్కా ప్రసాద్, రఫీ , శారద, రాజేష్, సురేష్, హేమంత్ గౌడ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.