జనసేన పార్టీ కార్యాలయానికి సంవత్సరం అద్దె వితరణ

  • పార్టీ బలోపేతానికి పత్తి చంద్రశేఖర్ విశేష కృషి..

అనంతపురం: జనసేన పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, పుట్టపర్తి నియోజకవర్గ సభ్యులు పత్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. అందులో భాగంగా ఓ.డి.సి మండలంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయ నిర్వహణకు ఒక సంవత్సరం పాటు అద్దెను అందించేందుకు పత్తి చంద్రశేఖర్ ముందుకు వచ్చారు. ఈ మేరకు జనసేన మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్, ఉపాధ్యక్షులు కొండబోయిన సతీష్ కి నగదును అందజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పత్తి చంద్రశేఖర్ ను ఘనంగా సత్కరించి.. మీ సారధ్యంలో పుట్టపర్తి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.