పెనుకొండ మున్సిపాలిటీ టౌన్ కమిటీ నియామక సమావేశం

పెనుకొండ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు వరుణ్ ఆదేశాలు మేరకు పెనుకొండ మున్సిపాలిటీ టౌన్ కమిటీ నియామకం కోసం శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం నాయకులు కుమార్, శబరిస్, మండల అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి సురేష్ ముఖ్య అతిధిగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో టౌన్ అధ్యక్షులు మరియు కమిటీని పూర్తి చేయడం, పార్టీ బలోపేతం గురించిచర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళ శ్రేదేవి, పార్టీ మండల ఉపాధ్యక్షులు సురేష్, కార్యదర్శి విజయ్, నాయకులు ప్రదీప్, లోకేష్, మల్లేష్, శివ తదితరులు పాల్గొన్నారు.