కూకట్పల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్స్ నియామకం

తెలంగాణ రాష్ట్రం, కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, విలువలను, పార్టీ సిద్ధాంతాలను నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తీసుకు వెళ్లి బూత్ స్థాయిలో బలోపేతం చేయడం కోసం శనివారం తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర మరియు కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కూకట్పల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్స్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించడం జరిగినది. ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల దృష్ట్యా అతి త్వరలో డివిజన్ మరియు బూత్ స్థాయి నూతన కమిటీలను కూడా నియమించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో కూకట్పల్లి జనసేన నాయకులు మరియు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.