జనసేన పార్టీ గొల్లప్రోలు మండల కమిటీ నియామకం

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, తాడిపర్తి గ్రామం యిందాన కొండల రాయడు కళ్యాణ మండపంలో జనసేన పార్టీ గొల్లప్రోలు మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి సమక్షంలో గొల్లప్రోలు మండలం అమరాది వల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ నియమించారు. ఈ సందర్భంగా శేషుకుమారి మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆదేశానుసారం మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు, జ్యోతుల శ్రీనివాస్, కమిటీలో ఉన్న వారికి బాధ్యతలు అప్పచెప్పి అలాగే ఇకనుంచి గ్రామ కమిటీ బూత్ కమిటీలు వేసి బలోపేత దిశగా ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యచరణ రూపొందించడం జరిగింది అన్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలంగా తీసుకెళ్లాలని, తప్పుడు ప్రచారం ఖండించాలని, దీనికి పార్టీ నాయకులతో ఎప్పుడు సహకారం అందిస్తుందని తెలిపారు. అలాగే ఏప్రిల్ 16 నుంచి ప్రతి ఇంటింటికి జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ మాట్లాడుతూ మండల స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా కమిటీ సభ్యులు ఉండి వారి వారి గ్రామాల్లో పార్టీని బలోపేత దిశగా ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి, ప్రజలను ఏ విధంగా చైతన్య పరచాలి అనే అంశాలపై వారికి చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మండల ప్రెసిడెంట్:- అమరాది వల్లి రామకృష్ణ. గౌరవ అధ్యక్షులు:- పెనుగొండ సోమేశ్వరరావు, అల్లం దొరబాబు, కోన రాధాకృష్ణ. మహిళ అధ్యక్షురాలు:- వినుకొండ అమ్మాజీ ఉపాధ్యక్షులు:- ఎలుగుబంటి దొరబాబు, ఇంటి వీరబాబు, గొల్లపల్లి గంగేశ్వరుడు. ప్రధాన కార్యదర్శులు:- యదాల ముత్తరావు, రావుల వీరభద్రరావు, ఎర్ర వీర వెంకట సత్యనారాయణ, దాటవర్తి చక్రారావు. ఉమ్మడి బోడకొండ, కార్యదర్శులు: శాఖ సుబ్బారావు, కండవల్లి మణికుమార్, పచ్చిపాల శివ, పాలపర్తి వీరబాబు, గారపాటి శివ కొండలరావు, బండి అప్పారావు, కొప్పన రమేష్, పొలం త్రిమూర్తులు. సంయుక్త కార్యదర్శులు: వట్టూరి శ్రీనివాస్, దమ్ము వీర వెంకట సత్యనారాయణ, ఉలవల శ్రీను, మొయిళ్ళ గంగా నాగేశ్వరరావు, శివకోటి అచ్చారావు, తూము సత్యనారాయణ, కోనేటి చక్రధర్, చెప్పుల నాని బాబు, ములగపాటి సత్య ప్రకాష్, శేశెట్టి భద్రం. సోషల్ మీడియా విభాగం: నూరుకుర్తి చక్రధర్. వీరికి బాధ్యతలు అప్పజెప్పి శాలువా కప్పి అందరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.