డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు

పెద్దాపురం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరిస్తూ ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జానకి రామారావు మరియు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది.