ఇంటిపల్లి ఆనందరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ గ్రామ కమిటీల నియామకం

రాజోలు, జనసేన నాయకుడు, రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు ఆధ్వర్యంలో రాజోలు మండలంలోని చింతలపల్లి గ్రామ జనసేన పార్టీ గ్రామ కమిటీ ఎంపిక శనివారం జరిగింది. చింతలపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడిగా గనసాల రామరాజు, ఉపాధ్యక్షులుగా కడలి జగదీష్, మార్లపూడి మధు ఎంపికయ్యారు. అలాగే మరో పన్నెండు మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు మాట్లాడుతూ రాజోలు మండలంలో అన్నీ గ్రామాల్లో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సారధ్యంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఇంటిపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిప్పళ్ల లక్ష్మణరావు, రుద్ర సత్యనారాయణ, కోళ్ల వేణు, గురుజు జగదీష్, కోళ్ల సత్తిబాబు, గనసాల బాలాజీ, రుద్ర ఏడుకొండలు, సాధనాల సూరిబాబు, పలివెల రమేష్, అద్దేపల్లి గోపి, పంగం తాతాజీ, కటికిరెడ్డి శివ, మద్దాల రాంకి, బెల్లంకొండ నాగబాబు, పిప్పలా వెంకన్న బాబు, గుండాబత్తుల చిన్న, దొండపాటి ఆనందకుమార్ మరియు వీరమహిళలు పాల్గొన్నారు.