కాపు సంక్షేమ సేన కమిటీ నియామకం

డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కాపు సంక్షేమ సేన యూత్ వింగ్ విస్తరణలో భాగంగా జిల్లా అద్యక్షులు డి.ఎస్.ఎన్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీలు నియమించడం జరిగింది. ముఖ్య అతిథులుగా జనసేన సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్, అమలాపురం రూరల్ మండలం జనసేన అధ్యక్షులు లింగోలు పండు, పడాల నానాజీ, ఆర్ డి ఎస్ ప్రసాద్, గన్నవరం మండల ఎంపీటీసీల సమైక్య అధ్యక్షులు ఆదిమూలం సురయ్యకాపు, కాపు సంక్షేమ సేన కోనసీమ జిల్లా అధ్యక్షులు తిక్క శేషుబాబు, కాపు సంక్షేమ సేన రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి పోలిశెట్టి బాబులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు తిక్క సరస్వతి, కాపు సంక్షేమ సేన లీగల్ సెల్ అధ్యక్షురాలు చాట్ల మంగతాయారు, అల్లవరం మండలం జనసెన నాయకులు కంకిపాటి గోపి పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా జనిపిరెడ్డి శ్రీ హరి, అమలాపురం పట్టణ అధ్యక్షులుగా పప్పుల నానాజి, పట్టణ ఉపాధ్యక్షులుగా నల్లా చిన్ని, పట్టణ కార్యదర్శిగా నాగనముడి సత్య శ్రీనివాస్, పట్టణ జాయింట్ సెక్రటరీగా వీర వీరేష్ లకు ముఖ్య అతిధులు చేతుల మీదుగా నియమావళి పత్రాలు అందజేశారు.