తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో ములకలపల్లి గ్రామకమిటీ నియామకం

ఉమ్మడి ఖమ్మం జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ శ్రీరామ్ తాళ్లూరి ఆదేశాల మేరకు ములకలపల్లి మండల జనసేనపార్టీ అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో ములకలపల్లి పంచాయతీలో గ్రామకమిటీ నియమించడం జరిగింది. ఈ కమిటీలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నకిరికంటి రాము, ఉపాధ్యక్షులుగా సుద్దాల రమేష్, ప్రధాన కార్యదర్శిగా తొర్లికుంట ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా జల్లారపు సుమంత్, గోపగాని పవన్ కళ్యాణ్, అలుగుల శ్రావణ్ కుమార్, కార్యదర్శులుగా గోపగాని సాయి ప్రకాష్, మోటా సుధాకర్ రాసూరి పవన్ కళ్యాణ్, మడకం రామకృష్ణ, బర్ల ప్రశాంత్, ఊకె ముత్యాలరావు, సహాయ కార్యదర్శులుగా మిరియాల సంతోష్, పువ్వల వంశీ, కుర్రం రామకృష్ణ, ఖమ్మం పాటి మురళి, కొత్తపల్లి శ్రీను, మామిటాల శివప్రసాద్, చీరలు చందు, జల్లారపు రాకేష్, పుప్పాల శేషు, వీరిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన, విద్యార్థి విభాగం నాయకులు గరికే రాంబాబు, గొల్ల వీరభద్రం మరియు మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, ప్రధాన కార్యదర్శి ఊకె నాగరాజు, మండల కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు పూసుగూడెం గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి బోలగాని పవన్ కళ్యాణ్, సెక్రటరీ సురేష్ గౌడ్, మైనార్టీ నాయకులు ఎస్కే పాషా తదితరులు పాల్గొన్నారు.