పుంగనూరు నియోజకవర్గ కమిటీ నియామకం

పుంగనూరు, రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మండల, నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో బూత్ కమిటీలు కూడా సిద్ధం చేసుకొని ఎలక్షన్ కి సిద్ధం అయ్యేలా ప్రణాళికలు చేసుకొంటూ గ్రామస్థాయి వరకు జనసేన పార్టీని బలోపేతం చేయదలిచామని జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చిన్నా రాయల్ తెలిపారు. ఈ కమిటీలో నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు జి.చంద్రబాబు, బిసి సెల్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్, వీర మహిళా అధ్యక్షురాలు అరుణ, లీగల్ సెల్ అధ్యక్షులు సి.వి శ్రీనివాస్, మైనారిటీ అధ్యక్షులు కాలేషా నియమితులయ్యారు. సమన్వయ మండల అధ్యక్షులు చౌడేపల్లి హేమంత్, పుంగనూరు టౌన్ మణికంఠ, పుంగనూరు రూరల్ పి.హరి, సోమల పవన్ కుమార్, సదుం నాగ తేజ, పులిచర్ల చంద్రబాబు, రొంపిచర్ల షేక్ బావాజీలను నియమించారు. ఈ నియామక పాత్రలు నియోజకవర్గ ఇంచార్జి సి.వి గంగాధర్ (చిన్నా రాయల్) వారికి అందచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమరనారాయణ పాల్గొన్నారు.