సింగరాజపాలెం జనసేన గ్రామకమిటీ నియామకం

గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం సింగరాజపాలెం గ్రామంలో జనసేన గ్రామ కమిటీ నియమించడం జరిగింది. సింగరాజపాలెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన గ్రామ జనసేన పార్టీ సమావేశంలో సింగరాజపాలెం గ్రామానికి చెందిన జనసైనికులను జిల్లా కార్యదర్శి అచ్చుత సత్యనారాయణ, మండల అధ్యక్షులు చోడసాని బాపిరాజు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. గ్రామ జనసేన అధ్యక్షులుగా దొండపాటి కృపా వెంకట లక్ష్మీ నారాయణ మరియు గ్రామ కమిటి పూర్తి కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వీరమహిళ చెందిల్ కుమారి,
రుద్రా శ్రీనివాస్, ఉన్నమట్ల రమేష్ బాబు, మేకా శ్రీనివాసరావు, మెయిని ఏడుకొండలు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.