జనసేన పసలదీవి గ్రామస్థాయి కమిటీ నియామకం

నరసాపురం మండలం, పసలదీవి గ్రామంలో జనసేన పసలదీవి గ్రామస్థాయి కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీలో గ్రామ అధ్యక్షులుగా లక్కు నరేష్, ఉపాధ్యక్షులుగా దొంగ ముత్యాలరావు, రంగిశెట్టి రాజు, గ్రామ యువత అధ్యక్షులుగా కొండేటి కృష్ణ, మిగతా కార్యవర్గం అంతా గ్రామ జనసేన నాయకులు ఎంపిక చేశారు. తదనంతరం జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, మేడిది బాబ్జి, వలవల నాని, కొల్లాటి గోపీకృష్ణ, ఆకుల వెంకటస్వామి, జక్కం బాబ్జి, నిప్పులేటి తారకరామారావు, దివి సత్యం, కొట్టు రామాంజనేయులు, పులపర్తి రాంబాబు, పులపర్తి పుల్లారావు, పోలిశెట్టి నళిని, వలవల సావిత్రి, పిప్పళ్ళ సుప్రజ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.