Araku: వాలిబాల్ టోర్నీ ప్రారంభించిన అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు

అరకు నియోజకవర్గం అరకు వేలీ మండలం ఇరగాయి పంచాయితీ ఉరుములు గ్రామంలో వాలిబాల్ టోర్నీ ప్రారంభించిన అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు. వాలిబాల్ టోర్నీలో పంచాయితీ పరిధిలోని చుట్టూ పక్కా గ్రామ యువత పాల్గొని వాలిబాల్ టోర్నీ విజయవంతం చేశారు. టోర్నీ లో 5 జట్లు పాల్గొన్నాయి. ప్రతి జట్టుకు ఒక బాల్ టి షర్టులు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భముగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రభత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఎంతో ప్రతిభ ఉన్న క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు వారిని ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జనసేనపార్టీ సిద్ధాంతాలు, పార్టీ కార్యక్రమాలు ఊపందుకున్నాయి ప్రతి గ్రామంలో టోర్నీలు పెట్టి క్రీడాకారులను గుర్తిస్తూ పార్టీ కార్యక్రమాలు జోరుగా ప్రచారం చేస్తున్న జనసేన నాయకులకు పల్లెల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కొనెడి లక్ష్మణరావు, కొర్రయి సర్పంచ్ పూజారి కొములు, డుంబ్రిగుడా మండల నాయకులు ప్రసాద్, అరకు మండల నాయకులు రామకృష్ణ , మత్యరాజు, అనంతగిరి మండలం నాయకుడు మురళి, డుంబ్రిగుడా ZPTC అభ్యర్థి కొనెడి చినబాబు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసారని మాదాల శ్రీరాములు తెలిపారు.