మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను మర్యాదపూర్వకంగా కలిసిన ఆరణి శ్రీనివాసులు

తిరుపతి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్వగృహం నందు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇరు పార్టీ నేతల మధ్య కుదిరిన సయోధ్య టిడిపి ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం తథ్యం గత ఐదేళ్లుగా వైకాపా అక్రమాలను ఎండకట్టాం చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తామని, చంద్రబాబు సిఎంగా అసెంబ్లీకి వస్తానని శపథం చేశారు. ఆయన శపథం నెరవేరెలా పని చేస్తామని పొత్తులో భాగంగా జనసేనకు తిరుపతి సీటు కేటాయించారని, చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును గెలిపిస్తామని, విజయం సాధించి చంద్రబాబుకు తిరుపతిని కానుకగా ఇస్తామని శ్రీనివాసులు గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ టిడిపిలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు సర్ధు మణిగాయి, వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి, తిరుపతి అభివృద్ధి గాడి తప్పాయి, గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు పవన్ కళ్యాణ్ టిడిపి బిజేపి లతో కూటమి ఏర్పాటు చేశారు ఈ కూటమిని గెలిస్పిస్తాము అని తెలియచేసారు. గత ఐదేళ్లుగా తిరుపతిలో సుగుణమ్మ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి తిరుపతి ప్రజలను వేధించారు వైసీపీ నేతలు తిరుపతిని లూఠీ చేశారు టిడిఆర్ బాండ్లలో నిజమైన బాధితులకు న్యాయం చేస్తాం.తిరుపతిలో గంజాయి అమ్మకాలను అరికడుతాం అందరి సహకారంతో తిరుపతిని అభివృద్ధి చేస్తాం గాజు గ్లాసుకు ఓటు వేసి నన్ను గెలిపించండి, ప్రజా సేవకుడిగా పనిచేస్తా జనసేన-టిడిపి-బీజీపీ కార్యకర్తలు నాయకులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటా అని తెలియచేసారు. జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన అంతం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోది లక్ష్యం. రాష్ట్రంలో ప్రజలను గెలిపించేందుకు మూడు పార్టీల అగ్రనేతలు నిర్ణయించారు. రాష్ట్రంలో స్వేచ్చా, స్వాతంత్రం వైసిపి పాలనలో లేకుండా పోయాయి. జనసేన అభ్యర్థికి మద్దతుగా ఇప్పటికే బిజెపి నిలవగా టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ముందుకు రావడం సంతోషమని తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డిని ఓడించి జనసేన జెండా ఎగురవేస్తామని తెలియచేసారు.