వెంకన్న ధనాన్ని జగన్ కు తరలిస్తున్నారా..?

న్యాయమైన సమస్యల కోసం దీక్ష చేస్తుంటే అరెస్టులు చేస్తారా….
కడుపు నింప లేనివారికి జైల్లో పెట్టే హక్కు లేదు….
అలిపిరి వద్ద అడ్డుకుంటామని ఉదయాన్నే దొంగచాటుగా అరెస్ట్ చేశారు…
మా నాయకులను కార్మికులను వెంటనే విడుదల చేయకపోతే బారీ ఆందోళనలు చవిచూస్తారు….

జనసేన నేతలు ఆగ్రహం…

ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు , అనేక రకాలుగా సేవలు చేస్తూ, ఈ కరోనా సమయంలో కూడా వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి శ్రమించే టీటీడీ అవుట్ సోర్సింగ్ కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చేకపోగా, శాంతియుతంగా టీటీడీ
ఎ.డి. బిల్డింగ్ వద్ద 14 రోజులుగా భారీ వర్షాలలో సైతం దీక్ష చేస్తున్న, అమాయకపు పారిశుద్ధ్య కార్మికులను శుక్రవారం ఉదయాన్నే ఏమరపాటుతో వారిని అతి రాక్షసంగా వాహనాల్లో లాక్కెళ్లి పోలీస్స్టేషన్లో బంధించడం అతికిరాతక చర్య అని జనసేన తిరుపతి నగర ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్బులో శుక్రవారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ అరెస్ట్ చేసిన సిపిఐ, సిపిఎం తదితర వామ, ప్రతిపక్ష పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అలిపిరి వద్ద భారీ ఆందోళనలను తలపెడతామని హెచ్చరించారు. సీఎం జగన్ టీటీడీ కార్మికుల కోరికలను తీరుస్తానని తుఫాన్ పర్యటనలు ఓ మహిళను ఓదారుస్తూ నమ్మబలికి, నేడు పోలీస్ స్టేషన్ లకు తరలించి మరియు హౌస్ అరెస్టులకు పాల్పడటం దారుణమన్నారు.

టిటిడి కార్మికుల గోడు, దేశం మొత్తం చూస్తుంటే, వైసిపి, టిడిపి అధిష్ఠానాలు పట్టించుకోకుండా జాప్యం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దాదాపు 5 వేల మంది కార్మికులు విధులు వదిలి నిరసనలో ఉంటే, తిరుమలలోని గెస్ట్ హౌస్ శుభ్రత కోల్పోవడంతో, అనంతపురం, ఒంగోలు ప్రాంతాలనుండి లేబర్ ని తీసుకువచ్చి టిటిడి వారు తాత్కాలికంగా వాడుకుంటున్నారన్నారు. తద్వారా టీటీడీకి నష్టం వాటిల్లిందని, ఇలా కూడా పాలకమండలి వెంకన్న రాబడికి గండి కొడుతున్నారని విమర్శించారు. రేపు జరగనున్న పాలకమండలి సమావేశాలలో కార్మికుల సమస్యలపై తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిని తమ నేత జనసేనాని దృష్టికి తీసుకెళ్లామని పవన్ కళ్యాణ్ కూడా మీడియా ముందు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారని తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో జనసైన నాయకులు రాజేష్ యాదవ్, హేమ కుమార్, సుమన్ బాబు, బాబ్జి, బీగాల అరుణ, అమృత, బాల తదితరులు పాల్గొన్నారు.