నిరసనలపై ఉక్కుపాదం.. సిపిఎం నేతల అరెస్టులు..

చెరకు బకాయి బిల్లులను చెల్లించాలని, ఎన్‌సిఎస్‌ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ… రైతు సంఘాలు నేడు బంద్‌, నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో… విజయనగరంలోని సిపిఎం, రైతు, చెరకు రైతు సంఘం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు.

* లచ్చయ్యపేట షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ… విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం రాస్తారోకో చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ… అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ నినదించారు. ప్రభుత్వం బాధ్యత వహించి రైతు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రోడ్డుపై బైఠాయించిన నేతలను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు.