కొండపల్లిలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి రంగా వర్ధంతి కార్యక్రమం

  • రంగా అంటే ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో చెందిన నాయకుడు కాదు..
  • అతను పేదల పక్షాన వుండే నాయకుడు
  • హరిజన, గిరిజన బడుగు బలహీనవర్గాలకు చెందిన నాయకుడు వంగవీటి మోహన రంగా
  • ఒక పేదల ఆశాకిరణం నేల రాలింది

మైలవరం నియోజకవర్గం: పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్న నేత వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సందర్భంగా వారికి కొండపల్లి మున్సిపాలిటీ రాధా రంగా అభిమాన సంఘము ఘనమైన నివాళి అర్పించారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదలకు ఇచ్చే ఇళ్ళ స్థలాల పంపిణీ విషయమై నాటి తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై నడి రోడ్డు మీద (బందరు రోడ్, విజయవాడ) ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న రంగా గారిని తెలుగుదేశం పార్టీ రౌడీలు అతి దారుణంగా నరికి చంపారు, రంగా మరణించి మూడు దశాబ్దాలు దాటినా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇంకా ప్రజల గుండెల్లో జ్వలిస్తూనే ఉందన్నారు. రంగాని భౌతికంగా లేకుండా చేశారు కానీ ఆయన ఉన్నతమైన ఆశయాలను మాత్రం ఏమి చేయలేకపోయారని సురేష్ అన్నారు. రంగా అంటే ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో చెందిన నాయకుడు కాదు, అతను పేదల పక్షాన వుండే నాయకుడు, హరిజన, గిరిజన బడుగు బలహీనవర్గాలకు చెందిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన మైలవరం నియోజకవర్గ ఇంచార్జి అక్కల గాంధీ, కాపు నాయకులు అడపా శివ, దేవబత్తుల నాగబాబు, నాగభూషణం, మున్సిపల్ కౌన్సిలర్లు కరిమికొండ శ్రీలక్ష్మి, అడపా వెంకయ్య నాయుడు, గుంజా శ్రీను, వైస్సార్సీపీ కార్మికసంగం నాయకులు శరబయ్య, జనసేన నాయకులు చెరుకుమల్లి సురేష్, యర్రంశెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్, శ్యామల సుజాత, అంజినీయులు, ఎస్. సురేష్ ఎర్రంశెట్టి సాయి, ఈశ్వర్ నాయుడు, గోపి చంద్, సాంబ, వి.టి.పి.ఎస్ ఉద్యోగస్తులు రాము, అచ్చుత రామయ్య, శ్రీను, మోహనరావు, టైలర్ నరసింహారావు పాల్గొన్నారు.