ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి: జనసేన డిమాండ్

భైంసా: పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆశ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశ వర్కర్లకు పారితోషికం 18000 రూపాయలకు పెంచి ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని కోరడం జరిగింది. గతంతో పోలిస్తే నేడు ఆశ వర్కర్లకు పనిభారం చాలా పెరిగింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి కుటుంబాన్ని కాపాడు కోవడానికి పడ్డ కష్టం అంత ఇంత కాదు. ప్రభుత్వానికి ప్రజలకు అందుబాటులో వుండి నిరంతరం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి లేని యెడల సెప్టెంబర్ 25 నాడు సమ్మె చేయడానికి సిద్దంగా వున్నారు. కాబట్టి ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేసి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో చేయబోయే సమ్మెకు జనసేన పార్టీ పూర్తిగా మద్దతు తెలియచేస్తున్నామని మహేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ, లక్ష్మి, శాంత, వందన, పద్మ, మంజుల, ఉజ్వల, మౌనిక, సులోచన, రేఖ తదితరులు పాల్గొన్నారు.