పిట్టాల్లా రాలిపోతున్న ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు

పాడేరు నియోజకవర్గం: పాడేరు ఐటీడీఎ పరిధిలో విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులు రోగాలు బారినపడి పదుల సంఖ్యలో చనిపోతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని జి.మాడుగుల జనసేన మండల అధ్యక్షులు మసాడి భీమన్న పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. గత ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి స్కూల్ లో ఎఎన్ఎం, హెల్త్ అస్టెంట్ లు ఉండేవారు. కనుక అప్పట్లో విద్యార్థుల మరణాల సంఖ్య తక్కులో ఉండేది. కానీ ఇప్పుడు అ పరిస్థితి లేదు. రోజుకొక స్కూల్లో విద్యార్థులు మరణిస్తున్నా కూడా నిమ్మకూనిరెత్తిననట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించడం విచారకరం. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. జనసేన పార్టీ గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వం దృష్టికి తెచ్చిన కూడా గిరిజన ప్రాంతంలో జరిగే నష్టాలను ప్రస్తుత ఎమ్మెల్యే గుర్తించరు కానీ ఎంత సేపు వ్యక్తిగత ప్రయోజనం కోసం రాజకీయాలే చేస్తూ ప్రతిపక్షాలకే విమర్శిస్తుంటారు తప్పితే వాస్తవ కోణంతో గిరిజన ప్రజానీకం స్థితిగతులపై సమీక్ష చేయరు మరీ ఇదేమి రాజకీయాలో నియోజకవర్గ ప్రజలు గమనించి దయచేసి ఇలా పని దొంగలకు నాయకులుగా ఎన్నుకునే అమాయక సంస్కృతి చరమ గీతం పాడకపోతే రేపటి భవిష్యత్ తరాలకు ముప్పు మాత్రం వాస్తవం వాళ్ళ వారసులు మాత్రం బాగుండాలి మన భవిష్యత్ తరాలు ఇలా మృత్యువాత పడాలి. వాళ్ళకి రాజకీయపదవులు కావాలి, మన ఓట్లు కావాలి. మనకు మన బిడ్డల చావులు, పేదరికం, కావాలి ఇలా జరిగితేనే వాళ్ళకి సంతోషం ఇది మన గిరిజన పాలకుల తీరు అని తెలిపారు.