ప్రజా సమస్యలపై చర్చించడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి: రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, రాష్ట్రంలో పరిపాలన ఉన్నట్టా లేనట్టా అని ప్రభుత్వాన్ని పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు విమర్శించారు. ఒక ప్రక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అందులో ప్రజల సమస్యల మీద చర్చించాలే కానీ ఎప్పుడో పాడుపడ్డ రాజధాని అమరావతి అంశాన్ని తీసుకువచ్చి ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చలను ప్రక్కదోవ పట్టించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వం పై మండిపడ్డారు. ఒక ప్రక్క రాష్ట్రంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ప్రజలకు ఉపాధి వంటి అంశాలపై చర్చించకుండా ప్రజలు గురవుతున్న ఇబ్బందులను గాలికి వదిలేసి రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా 3 రాజధానుల అంశంపై చర్చించడం ఏమిటని రాష్ట్రంలో పరిశ్రమలు రాక నిరుద్యోగులకు ఉపాధి లేక చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం చేయలేక ప్రక్క రాష్ట్రాలకు వలస పోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంటుందే తప్ప దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ప్రతిసారి నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల అంశంపై చర్చ పెట్టడం అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ పరపతి కోసం ప్రజల సమస్యల్ని గాలికొదిలేస్తున్నారని ప్రతిరోజూ రాష్ట్ర ఆర్థిక మంత్రి కేంద్ర ప్రభుత్వం దగ్గర చేయిచాచి అప్పులు చేయడానికి చూపిస్తున్న శ్రద్ధ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమ పథకాలు చూపించి ప్రజలను మభ్య పెట్టి ఓట్లు బ్యాంకు చెదరకుండా చూసుకుంటున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి సారించకుండా చేస్తున్నారని అలాగే వైఎస్సార్ దూల్హన్ కళ్యాణ పథకం పేరుతో పదవ తరగతి పాసైతేనే ఆ పధకం వర్తిస్తుందని మరి మిగిలిన వారు చదువులేని వారు కళ్యాణం చేసుకోవడానికి అర్హులు కారా అని రెడ్డి అప్పల నాయుడు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు రెడ్డి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.