రొడ్డు ప్రమాద బాధితుడికి అతికారి దినేష్ అర్థిక సాయం

రాజంపేట నియోజకవర్గం: వీరబల్లి మండలం, గురప్పగారి పల్లె పంచాయతీ, కొత్తవడ్డి పల్లి గ్రామనికి చెందిన ఉప్పుటోళ్ళ ప్రభాకర్ తన గ్రామంలో ఉపాధి లేక కుంటుంబ పోషన రోజు రోజుకి కష్టమవుతున్న దశలో ఉపాధి కోసం మరి కొద్ది రోజుల్లో కువైట్ కు వెల్లడానికి సిద్ధమయ్యారు. ఈ పని నిమిత్తం తన బైక్ లో రాయచోటికి పోయి తిరిగి వస్తుండగా జగన్ అన్న రొడ్ల (గుంతల రొడ్లు) వల్ల రోడ్డు ప్రమాధ బారిన పడి తీవ్ర గాయలతో నడవలేని దుస్థితిలో వున్నారు. ఉప్పుటోళ్ళ ప్రభాకర్ పరిస్థితిని తెలుసుకున్న రాజంపేట జనసేన పార్టీ యువనాయకులు అతికారి దినేష్ తిరుపతిలోని పద్మావతి అసుపత్రికి పోయి బాధితుని పరమర్శించి రు.10వేల రూపాయలు అర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా శతఘ్ని న్యూస్ తో అతికారి దినేష్ మాట్లడుతూ గుంతల రొడ్ల వల్ల గాయపడిన ప్రభాకర్ త్వరగా కోలుకోవాలని ఆయన కుంటుంబానికి మద్దతుగా వుంటామని, వారి కుంటుంబానికి భవిష్యత్తులో అండగా వుంటనని తెలియజేశారు.