పామూరులో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

పామూరు: జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కలయికలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పామూరు పట్టణంలోని రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలమందల రహీముల్లా మరియు పామూరు మండల అధ్యక్షుడు దర్శి ఏడుకొండలు మరియు పగడాల మల్లికార్జున వాసు సీనియర్ నాయకులు గోస్ట్ సునీల్ మరియు టిడిపి పార్టీ టౌన్ అధ్యక్షుడు అయినటువంటి కాజా రహమతుల్లా ఎంపీటీసీ సభ్యులు బొల్ల నరసింహారావు, ఉప్పలపాటి హరిబాబు, ఇర్రి కోటిరెడ్డి, పులి నాయబా, పందిటి హరీష్ మరియు జనసేన పార్టీ నాయకులు మరియు టిడిపి నాయకులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.