చికిత్స పొందుతున్న జంగాలపల్లి గ్రామ ప్రజలకు మనోధైర్యాన్నిచ్చిన అతికారి దినేష్

రాజంపేట నియోజవర్గం, సిద్ధవటం మండలం, జంగాల పల్లికి చెందిన గ్రామ ప్రజలు ఇటీవల ఉపాధి పని కోసం ఆటోలో వెళుతున్న సందర్భంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులకు గాయాలు కావడం, అందులో ఇద్దరు ప్రయాణికులకు యాక్సిడెంట్ లో పూర్తిగా కాళ్లు తీసేయడం జరిగింది. ఈ సంఘటన తెలుసుకున్న రాజంపేట జనసేన పార్టీ యువ నాయకుడు అతికారి దినేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జంగాలపల్లి గ్రామ ప్రజలను పరామర్శించి వారికి వైద్య ఖర్చుల కొరకు జనసేన పార్టీ తరఫున దినేష్ 60,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, అంతే కాకుండా ప్రమాదంలో గాయపడ్డ జంగాలపల్లి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని లేని పక్షంలో బాధితుల అండగా పోరాటం చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఇన్చార్జి కొట్టే రాజేష్, జనసేన నాయకులు పండ్ర రంజిత్, కోనేటి హరి, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.