లోకం మాధవి ఆధ్వర్యంలో యువ భరోసా – అట్టహాసంగా ఎంసెట్ రిజిస్ట్రేషన్స్

నెల్లిమర్ల నియోజకవర్గం, యువభరోసా కార్యక్రమంలో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గ యువతను ప్రోత్సహిస్తూ ఇంటర్మీడియట్ పూర్తయిన పేద విద్యార్థినీవిద్యార్థులకు అండగా జనసేన పార్టీ తరపున నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ప్రవేశ రుసుము మరియు శిక్షణా కార్యక్రమం ఇవ్వదలచుకున్నారు. అందులో భాగంగా ఆదివారం నెల్లిమర్ల నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఎంసెట్ రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రతి మండలంలో ఒక స్టాల్ ని పెట్టి ఆ మండలం కి చెందిన విద్యార్థినివిద్యార్థులకు ఎంసెట్ రిజిస్ట్రేషన్ తో పాటు ప్రవేశ రుసుము చెల్లించారు. ఈ కార్యక్రమానికి నెల్లిమర్ల నియోజకవర్గం నలుమూలల నుండి అశేష స్పందన లభించింది. నియోజకవర్గానికి చెందిన ఎంతోమంది పేద విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. లోకం మాధవి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎంతో మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చేసి ఆపేస్తున్నారని, దీనికి ముఖ్య కారణం వారికి అవగాహన కల్పించేవారు లేకపోవడమే అని, మన ఊరిలో జనవాణి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరిలో ప్రజా సమస్యలుతెలుసుకుంటున్నప్పుడు సాధారణంగా వినిపిస్తున్న సమస్య తమ పిల్లలు 10 లేదా ఇంటర్మీడియట్ తో చదువుని ఆపేసుకొని ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నారని, కొంతమంది పిల్లలు ఇంజనీరింగ్ చేయాలని నిశ్చయించుకున్న వారికి దిశా నిర్దేశం చేసే వారు లేరని పలువురు తల్లిదండ్రులు తన దగ్గర వాపోయారని మాధవి తెలిపారు. దీనిని అధిగమించి ఎంతోమంది విద్యార్థులను ఇంజనీరింగ్ వైపు నడిపిద్దాం అనే భాగంలోనే యువ భరోసా అనే కార్యక్రమం తాము మొదలుపెట్టినట్టు లోకం మాధవి తెలిపారు. అందులో భాగంగానే పేద విద్యార్థిని విద్యార్థులకు ఎంసెట్ ప్రవేశ రుసుము మరియు కోచింగ్ ఉచితంగా ఇవ్వదలుచుకున్నామని దీనివలన వారు ఇంజనీరింగ్ చేసి వారి బంగారు భవిష్యత్తుకి నాంది పలుకుతారని ఆశిస్తున్నామని లోకం మాధవి తెలియజేశారు. నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఈ ఎంసెట్ రిజిస్ట్రేషన్స్ నమోదు అవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని తెలిపారు.