పవన్ కళ్యాణ్ పై దాడిచేసే ప్రయత్నం, ఆందోళనలో జనసైనికులు: ఎస్ వి బాబు

పెడన, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కొందరు అనుమానాస్పద వ్యక్తులు వెంబడిస్తున్నారని, విశాఖపట్నం సంఘటన తర్వాత తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఇంటి నుండి ఎప్పుడు బయటకు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అనే విషయాలను గమనిస్తూ, పవన్ కళ్యాణ్ గారి కారుని ఫాలో అవుతూ రెక్కీ నిర్వహిస్తున్నారని తన వ్యక్తిగత రక్షణ సిబ్బంది తెలియజేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే జనసైనికులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ఈ విషయంపై వెంటనే విచారణ చేపట్టాలని, ప్రాథమిక నివేదిక అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పెడన నియోజకవర్గ జనసేన పార్టీ నుండి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ పై ఏ చిన్న దాడికి ప్రయత్నించినా, జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. జనసైనికులను, పవన్ కళ్యాణ్ అభిమానులను ఆపటం ఎవరితరం కాదు. జనసేన పార్టీకి ప్రజల్లో విపరీతమైన ప్రజాధరణ పెరగడం వల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచడం వల్ల, ఏదైనా కుట్రలు పన్నుతున్నారనేది జనసైనికులుగా మా అనుమానం. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రక్షణ పెంచి, కేంద్ర బలాల ద్వారా రక్షణ కల్పించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడం ప్రతి జనసైనికుడి బాధ్యత అని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్.వి.బాబు అన్నారు.