జనసేన పార్టీ రైతన్నలకు అవగాహన సదస్సు…!!!

పిఠాపురం మండలం, పి.దొంతమూరు గ్రామంలో కర్రీ హరిబాబు ఆధ్వర్యంలో “రైతన్నలకు అవగాహన సదస్సు” నిర్వహించారు. అక్కడ ఉన్న రైతులతో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి హస్బెండ్ డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ మాట్లాడుతూ.. పండించే రైతన్న లేకపోతే తిండి ఎక్కడది.. అటువంటి రైతులకు అండగా ఉండవలసిన ప్రభుత్వాలు మాట మారుస్తుందని.. అధికారం రాకముందు ఒక మాట.. వచ్చాక ఒక మాట చెప్తున్నారని.. అలాగే చనిపోయిన రైతులకు అండగా ఉండటంలో నిర్లిప్తత వహిస్తున్నారన్నారు. ఒకట్రెండు సంవత్సరాల్లో జనసేన ప్రభుత్వం వస్తుందని.. ప్రజలకు అండగా ఉండి మంచి పరిపాలన అందిస్తుందన్నారు. అలాగే అధికారం లేకపోయినా సొంత కష్టార్జిత సంపాదనతో ఒక మంచి కార్యక్రమం చేపట్టి.. ఆత్మహత్య చేసుకొన్న 3000 కౌలు రైతు కుటుంబలకు 30 కోట్లతో భరోసా ఇచ్చి.. ఆ కుటుంబానికి సొంత కొడుకులా ఉండి.. ఒక్కొక్క రైతుకు లక్ష రూపాయలు అందిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలి ఆత్మహత్యలు చేసుకోవద్దని మీ కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని చెప్పారన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ అధ్యక్షులు పిఠాపురం ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు 5లక్షలు ప్రకటించారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్రి హరిబాబు, పులి రమణ, పి. ఎస్. ఎన్. మూర్తి, కర్రీ కాశీ, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, గోపు సురేష్, యండ్రపు శ్రీనివాస్, గుడాల ఏడు కొండలు, గుడాల విష్ణు, ప‌‌‌ల్లా సందీప్, చింతల మదు, ముర్రే జగన్, దెయ్యాల రమణ, కమ్మర డేవిడ్ రాజు, పులి కిష్ణ, కర్రి నరేష్, దారా సత్తిబాబు, చింతల శశి కుమార్, పల్లా నాగసూరి, పల్లా ఆత్మ, కుక్కల దుర్గ, గుండే రాజు, కమ్మర నాని బాబు, పల్ల నాగేశ్వరరావు, చింతల మాలియ్య, వాసంశెట్టి రామ్, ఇంటి విజయ్, కాకర్ల సురేష్, కుక్కల అర్జున్, మొగిలి ఆంజి, గుడాల కుపాలు, కంద సోమరాజు, మేళం బాబి, తోట సతీష్, అడబాల వీర్రాజు, కసిరెడ్డి నాగేశ్వరరావు, నామ శ్రీకాంత్, రైతన్నలు జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.