అయ్యప్పస్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలి

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన జానీ మాట్లాడుతూ భీమవరంలో అయ్యప్ప స్వాముల పడి పూజని అడ్డుకున్న అధికారులు నేరుగా ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప పాటలు పాడుతూ నిరసన చేపట్టే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుంది అని ఒక జనసేన పార్టీ గా, అయ్యప్ప స్వామిగానే కాకుండా ఒక భారతీయుడిగా ఈ యొక్క చర్యలనీ త్రివ్రంగా ఖన్డిస్తున్నాను అని జనసేన జానీ అన్నారు. మత్స పుండరీకం మాట్లాడుతూ భీమవరంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అయ్యప్పస్వామి పడి పూజ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహిస్తే అధికార పార్టీ వైస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, అధికారులు అడ్డుకోవడం సిగ్గుచేటు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన మీ వైస్సార్సీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలలో ఎమ్మెల్యే లు, ఎం.ఎల్.సి లు, నాయకులు, ప్రభుత్వం అధికారులు అశ్లీల నృత్యాలు చేయవచ్చు, మీ నాయకుల మాటలువిని టెక్కలికి చెందిన ఓ పోలీస్ అధికారి కూడా సస్పెండ్ అయ్యారు. మీ అశ్లీల నృత్యాలకు, మీ ఆనందానికి ఓ ప్రభుత్వ ఉద్యోగికి నష్టం జరిగింది. భారతదేశం సాంస్కృతి, సంప్రదాయం, హిందు ధర్మం ప్రకారం నిర్వహించిన అయ్యప్పస్వామి పడి పూజని అడ్డుకోవడం హిందు సాంప్రదాయం కి విరుద్ధంగా వైస్సార్సీపీ పాలన సాగుతోందని అయ్యప్ప స్వామి వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భీమవరం వైస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.