సూళ్లూరుపేటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

సూళ్లూరుపేట నియోజకవర్గం: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం సూళ్లూరుపేట మండల జనసేన నాయకుడు తోట మురళి రెడ్డి అధ్యక్షతన మతకాముడి గ్రామంలో అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి జనసేన క్రియాశీల సభ్యత్వం కిట్లు అందజేసి, తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క జనసైనికుడికి మనస్ఫూర్తిగా సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన నాయకులు రోసనూరు సోమశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.