జనసేన ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తిరువూరు, ఏ కొండూరు, భారత తొలి ఉప ప్రధాని భారత జాతి ముద్దు బిడ్డ బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతిని ఘనంగా నిర్వహించిన కృష్ణాజిల్లా జనసేన పార్టీ. ఏ కొండూరు మండలంలోని చీమలపాడు జాతీయ రహదారి వద్ద జనసేన పార్టీ స్థూపం వద్ద క్రిష్ణా జిల్లా జనసేన కార్యదర్శి మరియు తిరువూరు నియోజకవర్గం నాయకులు మనుబోలు శ్రీనివాసరావు మరియు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వెంపాటి ఏసయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జనసైనికులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి భారత ప్రభుత్వంలో అత్యున్నత మైన పదవులు అధిరోహించిన బాబు జగజీవన్ రామ్ జీవితం నేటి యువతకు ఆదర్శంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జగజ్జీవన్ రామ్ తొలి ఉప ప్రధానిగా కార్మికశాఖ మంత్రిగా రక్షణశాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేయడమే కాకుండా సమాచారం శాఖ మంత్రిగా రాజ్యాంగ రూపకల్పన అభివృద్ధి సభ్యుడిగా ప్రజ్ఞాశాలిగా పేరు గడించారని ఆయన అన్నారు. దేశంలో విప్లవానికి నాంది పలికిన నాయకుడిగా మరియు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినపుడు రక్షణ శాఖ మంత్రిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి బంగ్లాదేశ్ దేశం ఏర్పాటు కావడంలో పరోక్షంగా తోడ్పాటును అందించారని ఆయన సేవలను కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ మొదటి నుండి కార్మికుల పక్షపాతిగా పనిచేస్తూ వారికి అండగా ఉంటూ వారి హక్కుల కోసం పోరాడారని ఆయన అన్నారు. ముఖ్యంగా నేడు దేశంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ పథకాలకు పట్టణాలకు వాడలకు వారి పూర్వీకుల పేర్లు పెట్టుకుంటూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన నేటి రాజకీయ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.. మీపల్లె లో ఉన్నటువంటి దళితవాడలకు బాబు జగజీవన్ రామ్ నగర్, అంబేద్కర్ నగర్, జ్యోతిరావు పూలే కాలనీ, దామోదరం సంజీవయ్య కాలని, సావిత్రిబాయి పూలే కాలనీ, వంటి మహనీయుల పేర్లు పెట్టుకోవాలని నేటి యువతకు జనసేన పార్టీ నుండి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ కొండూరు మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి వెంపాటి ఏసయ్యా, వెంపాటి పవన్, తుళ్లూరు విశ్వనాథం, ఆర్ కోటేశ్వరరావు ముదిగళ్ళ సాయి, శ్యామ్, మురళి తదితరులు పాల్గొన్నారు.