వాలంటీర్లను రెచ్చగొట్టి ఏం సాధించాలని చూస్తుందో..?

  • అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య

పాడేరు: చింతపల్లి మండలం, మడిగుంట గ్రామంలో సమావేశమైన జనసేన పార్టీ నాయకులు చింతపల్లి మండల నాయకులు ఉల్లి సీతారామ్, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, మండల అధ్యక్షులు బుజ్జిబాబు వంతల అధ్యర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా జనసేన పార్టీ పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య హాజరయ్యారు. ఈ సమావేశానికి చింతపల్లి మండల జనసైనికులు నాయకులు అశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా వంపూరు గంగులయ్య మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రజలు కోల్పోయిన హక్కులు, జీవోలతో పోల్చుకుంటే ఇప్పటి వైసీపీ గిరిజన ప్రజాప్రతినిధులు చెప్తున్న మాటలు అక్షరాల అసత్యాలనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరించి వాలంటీర్లను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే కుటీలనీతి ప్రదర్శించాలని చూసారు కానీ వారికి అమ్ముడుపోయే మీడియా కంటే శక్తివంతమైన సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నిజాలు నిగ్గుతీసి అడుగుతున్నారు. జాతీయస్థాయి ఎన్.సీ.బీ వారు ఇచ్చిన నివేదిక ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని, అందులో విస్మయానికి గురిచేసే వాస్తవం ఉందని, ఆ వాస్తవాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు ఎందుకు వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారో ప్రతి గిరిజనుడి తెలుసని అన్నారు. ఆ మాటకొస్తే ఎన్నడూ లేని నిరసనలు, ఆగ్రహ జ్వాలలు ఇప్పుడు వాలంటీర్లను రెచ్చగొట్టి ఏం సాధించాలని చూస్తుందో..? ఆ దుశ్చర్యలు రేపటికి వైసీపీ పార్టీకి పెద్ద ముప్పుగా మారనుందని అన్నారు. గిరిజన జాతి ప్రయోజనాన్ని, అస్తిత్వాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం నిలువునా అత్యాచారం చేస్తే నోరు విప్పలేని బానిసత్వపు నాయకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లను అవమానించారని గగ్గోలు పెడుతున్నారు. ఈ లెక్కన చూస్తే వారి వాదన వారి రాజకీయ సమర్థత ఏపాటిదో అంచనా వెయ్యవచ్చని అన్నారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రజాప్రతినిధులు అభద్రతభావంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అనంతరం మండల నాయకులతో జనసైనికులతో కలిసి 8 కిలోమీటర్ల దూరం బైక్ ర్యాలీ చేస్తూ జనసేన పార్టీ నినాదాలతో చింతపల్లి మండల ప్రధాన కూడలి, జనంతో రద్దీగా ఉండే మార్కెట్ యార్డ్ ప్రదేశానికి చేరుకుని జనసేన పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని 12 అంశాల ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని చింతపల్లి మండల సంతబయలు నుంచి ఆర్టిసి కాంప్లెక్స్ వరకు గిరిజన ప్రజలకు పంచుతూ.. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై ప్రజలకు చైతన్య పరిచే కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారిపై వైసీపీ నేతలుచేస్తున్న దుష్ప్రచారానికి నిరసనగా చింతపల్లి ప్రధాన కూడలిలో గల జాతిపితమహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాలకు పాలభిషేకం చేసి అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు నినాదాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉల్లి సీతారామ్, కిల్లో రాజన్ లీగల్ అడ్వైజర్, బుజ్జిబాబు వంతల, వాడకని నానీ, ఫునిత్, రాజు దేపురు, కొయ్యం బాలు, సిద్దు, కోటేశ్వరరావు, ఈశ్వర్రావు, జి.మాడుగుల నాయకులు మసాడి భీమన్న, రమేష్ తాంగుల, తల్లే త్రిమూర్తి, పాడేరు నాయకులు అశోక్, నగేష్, ఇంకావనేకమంది ముఖ్య నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.